Breaking News

ఆర్టీసీ పరిరక్షణే జేఏసీ లక్ష్యంగా పనిచేస్తాం…ఆర్టీసీ జేఏసి కన్వీనర్లు

-42 వేల మంది ఆర్టీసి ఉద్యోగుల సంతకాలతో కలెక్టర్ల ద్వారా సి.యం కు వినతిపత్రాలు అందించాం.
-జూలై 30 ఆర్టిసి యం.డి తో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగినా సరే మినిట్సు పై స్పష్టత లేని కారణంగానే ఉద్యమం కొనసాగిస్తున్నాము..: జేఏసీ కన్వీనర్లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ పీటీడీ (ఆర్టీసీ) పరిరక్షణ,విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మూడో దశ ఉద్యమంలో భాగంగా సోమవారం ఆర్టీసిలో పనిచేస్తున్న 42 వేల మంది ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతిపత్రాలను రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న 27 జిల్లాల జేఏసీ నాయకులు ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి కి సమర్పించామని ఆర్టీసి జేఏసి కన్వీనర్లు వై.శ్రీనివాసరావు,పలిశెట్టి దామోదరరావు సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ, ఆర్టీసీ ఎండీ మరియు ఉన్నతాధికారులతో జూలై 30 న నిర్వహించిన జాయింట్ మీటింగ్‌లో చర్చించిన 25 డిమాండ్లపై చర్చలు సానుకూలంగా జరిగినా సరే చర్చల్లో జరిగిన అంశాలను జేఏసి నాయకత్వం చర్చించిన అంశాలపై యాజమాన్యం వాట్స్ అప్ ద్వారా ఇచ్చిన మినిట్సులో స్పష్టమైన హామీలు ఇవ్వని కారణంగా ఈ మినిట్స్ పై అభ్యంతాలు తెలియజేస్తూ సోమవారం యాజమాన్యానికి లేఖ ఇచ్చామని తెలిపారు.

ఆర్టీసి ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని దశలవారీగా మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తూ సమస్యలు పరిష్కారం చేయాలని ఆర్టీసీ యాజమాన్యానికి చిత్తశుద్ధి ఉంటే ఇంతవరకు జరిగిన అన్ని అంశాలపట్ల మరియు జేఏసిలో ఉన్న అన్ని సంఘాలు ఇచ్చిన లేఖలలో అన్ని సమస్యలుపై స్పష్టత వచ్చేలా మినిట్సు ఇస్తే దానిపై రాష్ట్ర జేఏసి నాయకత్వం చర్చించి జేఏసి అభిప్రాయాలను తెలియజేస్తామని అంతవరకు మూడవదశలో తీసుకున్న జేఏసి ఆందోళన కార్యక్రమాలు యాధావిధిగా కొనసాగిస్తామని జేఏసి కో-కన్వీనర్లు పి.వి.రమణారెడ్డి, జి.వి.నరసయ్య, సి.హెచ్.సుందరయ్య, కట్టాసుబ్రమణ్యం, యస్.వి.శేషగిరిరావు, వై.శ్రీనివాసరావు, కె.సూర్యప్రకాశరావు, డి.మాల్యాద్రి తెలిపారు.

మూడవధశ ఆందోళన కార్యక్రమాలు
-జేఏసీ ప్రకటించిన తదుపరి ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఆగస్టు 7, 8 తేదీలలో రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఇతర సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులను కలిసి ఉద్యమానికి సంఘీభావం, మద్దతు కోరుతూ లేఖలు ఇస్తాం.

-అదేవిధంగా ఆగస్టు 17, 18 తేదీలలో రాష్ట్రంలోని అన్ని డిపోలు, యూనిట్లలో రెండు రోజుల పాటు సామూహిక రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ రెండు రోజులలో ఆర్టీసీ ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్దఎత్తున దీక్షల్లో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

-ఇక ఆగస్టు 28న రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజా రవాణా అధికారి (DPTO) కార్యాలయాల ఎదుట భారీ మహా ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి వేలాది మంది ఉద్యోగులతో ఈ కార్యక్రమాలను నిర్వహించి ప్రభుత్వ దృష్టికి

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *