-తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు బీపీటీ స్టీమ్ సన్న బియ్యం కిలో రూ.52, రా రైస్ రూ.50కే విక్రయిస్తారు : యార్లగడ్డ
-సంక్షేమంతో పాటు అభివృద్ధినీ సమాంతరంగా అమలు చేస్తున్న ఎన్డీయే ప్రభుత్వం: యార్లగడ్డ వెంకట్రావు
-పట్టిసీమ ద్వారా సాగునీరు అందించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు: ఎమ్మెల్యే
-చిక్కవరం చెరువు ఘటనపై నిర్లక్ష్యం సహించను.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: యార్లగడ్డ
-గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రహదారులు దెబ్బతిన్నాయి.. దశలవారీగా పునరుద్ధరిస్తున్నాం: ఎమ్మెల్యే
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సామాన్య ప్రజలకు నాణ్యమైన బీపీటీ సన్న బియ్యాన్ని తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం రైతు బజార్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సన్న బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. బీపీటీ స్టీమ్ సన్న బియ్యాన్ని కిలో రూ.52కు, బీపీటీ రా రైస్‌ను కిలో రూ.50కు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి నెలకు 10 కిలోల చొప్పున బియ్యం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గత 26 నెలలుగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పింఛన్ల పంపిణీ నుంచి ప్రజా సమస్యల పరిష్కారం వరకు ప్రజాప్రతినిధులే నేరుగా పాల్గొంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన రహదారులను పెద్దఎత్తున పునరుద్ధరిస్తున్నామని, ఇప్పటికే 70 నుంచి 80 శాతం రోడ్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా కొన్ని కీలక రహదారుల పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా నీటి విడుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవ వల్లే రైతులకు ఉపశమనం లభించిందన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని చెప్పారు. చిక్కవరం చెరువులో గతంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, అక్రమ మైనింగ్, చెరువుల భద్రత అంశాల్లో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించి కేసుల నమోదులో జరిగిన జాప్యంపై కూడా అధికారులను ప్రశ్నించినట్లు తెలిపారు. మార్కెట్‌లో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సామాన్య కుటుంబాలకు ఉపశమనం కల్పించేందుకే ఈ ప్రత్యేక విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు యార్లగడ్డ పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ఈ పథకం అమలులోకి వచ్చిందన్నారు. అలాగే పంచాయతీరాజ్ శాఖలో 10 వేల ఉద్యోగ పదోన్నతులు కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నామని చెప్పారు. రైతు బజార్‌లో ఇంకా ఖాళీగా ఉన్న స్థలాల్లో అదనపు దుకాణాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులకు సూచించినట్లు తెలిపారు. రైతులు, వ్యాపారులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, జనసేన పార్టీ సమన్వయకర్త చల్లమలశెట్టి రమేష్‌బాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం మండల పార్టీ అధ్యక్షులు గుడపాటి తులసీమోహన్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బోడపాటి రవి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మల్ఫూరి సాయి కళ్యాణి, టీడీపీ సీనియర్ నాయకులు దొంతు చిన్నా,బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి కానూరి శేషు మాధవి, తిరువీధి నరేష్, జొన్నలగడ్డ సుధాకర్, గొంది నరేంద్ర, ఆళ్ళ వెంకట గోపాలకృష్ణ, కంభంపాటి లక్ష్మీ నరసమ్మ, మేడిపల్లి రమ, చిమటా రవివర్మ, యనమదల సతీష్ , మున్నా రామకృష్ణ, పరుచూరి నరేష్, పలగాని రాంబాబు, నల్లూరు వెంకట రత్నం, బస్సే సరిత, తాటిపాముల నాగయ్య, జాస్తి రేణుక,చల్లగుల్ల సందీప్, అన్నే హరికృష్ణ, బడుగు ఝాన్సీ, రామినీడు బసవపూర్ణయ్య, జాస్తి మురళి, చల్లగాలి సునీల్, సొంగ సంతోష్, మణిమాల వెంకట అప్పారావు, ఉయ్యూరు వెంకటేశ్వరరెడ్డి, కాగితాల నాగరాజు, మోదుగుమూడి వేణు, బస్సే నాగప్రసాద్, కొసరాజు సాయి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News