విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నాయకులతో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు.
43 వ డివిజన్, ఊర్మిళ నగర్ కు చెందిన ఓగిరాల రాజేశ్వరి గర్భాశయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 1 లక్ష 87 వేల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు.
34 వ డివిజన్, కేదారేశ్వరపేట కు చెందిన కే జోజమ్మ (71) దీర్ఘకాలిక శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతూ వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 8 లక్షల 26 వేల విలువైన ఎల్ ఓ సీ ను ఎన్డీయే కార్యాలయంలో అందజేశారు.
త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వీర బాబు స్వామి దేవస్థానం అధ్యక్షులు కొమ్మూరు బసవరాజు, కూటమి నాయకులు గోవిందమ్మ, బొల్లేపల్లి కోటేశ్వరరావు, ఆకుల రవి శంకర్,పగడాల కృష్ణా, రుద్రపాటి వెంకటేష్ పచ్చవ మల్లికార్జునరావు, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News