Breaking News

ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఈనెల 8 నుండి విజయవాడ – వాడపల్లి వన్-డే టూర్ ప్యాకేజీ ప్రారంభం

-ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ (ట్రాన్స్‌పోర్ట్ & మార్కెటింగ్) టి.ఎస్.వి. నారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ఈనెల8 (శనివారం) నుండి విజయవాడలోని సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (CRO) కేంద్రంగా ఒక రోజు ‘విజయవాడ – వాడపల్లి టూర్ ప్యాకేజీ’ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ (ట్రాన్స్‌పోర్ట్ & మార్కెటింగ్) టి.ఎస్.వి. నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

భక్తులకు, పర్యాటకులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సౌకర్యవంతమైన రవాణా, ఆహార వసతులతో ప్రణాళికాబద్ధమైన తీర్థయాత్ర అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్యాకేజీని రూపకల్పన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ టూర్ ప్యాకేజీ ఆగస్టు 08న ఉదయం 4:00 గంటలకు విజయవాడలోని సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ వద్ద ప్రారంభమై, తిరిగి సాయంత్రం 7:00 గంటలకు విజయవాడ చేరుకుంటుందన్నారు. ప్యాకేజీ ధర పెద్దలకు రూ. 1,160/-, పిల్లలకు రూ. 1,000/- గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ రుసుములో సౌకర్యవంతమైన బస్సు రవాణా ఛార్జీలతో పాటు ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్న భోజన వసతి కలిగి ఉంటాయని, అయితే ఆలయ దర్శనం టికెట్ ఛార్జీలను పర్యాటకులే స్వయంగా భరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రత్యేక యాత్రను సద్వినియోగం చేసుకోవాలనుకునే భక్తులు మరియు పర్యాటకులు www.aptdc.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో గానీ, లేదా విజయవాడ బందర్ రోడ్, లెమన్ ట్రీ హోటల్ పక్కన ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (CRO) వద్ద నేరుగా సంప్రదించి తమ సీట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ లిమిటెడ్ జనరల్ మేనేజర్ టి ఎస్ వి నారాయణ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *