Breaking News

నిజమైన క్రీడాకారులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి… : ఆర్కే పురుషోత్తం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు, క్రీడా ధ్రువపత్రాల జారీ, గాంధీవ ప్రాజెక్టు అమలులో భారీ అక్రమాలు జరిగాయని రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2017 నుంచి ఈ అక్రమాలపై సంబంధిత ప్రభుత్వాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదన్నారు. జంతు సంరక్షణ శాఖ, గ్రామ సచివాలయాలు, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో నకిలీ క్రీడా ధ్రువపత్రాలతో వందలాది మందికి ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. నకిలీ క్రీడా ధ్రువపత్రాలతో అనర్హులకు ఉద్యోగాలు కల్పించడం వల్ల నిజమైన క్రీడాకారులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులకు తప్పనిసరిగా స్కిల్ టెస్ట్ నిర్వహించాలని, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన వారిని తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్కే పురుషోత్తం డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ అథారిటీలో సమూల ప్రక్షాళన చేపట్టి, ఐపీఎస్ అధికారుల పర్య వేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని, నిజమైన క్రీడాకారులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *