Breaking News

నగరంలో ఘనంగా బిజినెస్ ఎక్స్‌పో ప్రారంభం

-ఒకే చోట అన్ని ఉత్పత్తులు
-మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని సత్యనారాయణపురంలో గాయత్రీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన బిజినెస్ ఎక్స్‌పో కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఎక్స్‌పోను మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ప్రతి ఒక్క స్టాల్ వద్దకు వెళ్లి కొనుగోలు సామాగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వ్యాపారవేత్తలంతా ఒక టీమ్‌గా, సమూహంగా ఏర్పడి ఇలాంటి ఎక్స్‌పోలు నిర్వహించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. వినియోగదారులకు కావలసిన వివిధ రకాల ఉత్పత్తులు ఒకే చోట లభించే వెసులుబాటు ఈ ఎక్స్‌పో ద్వారా కలుగుతుందన్నారు. వ్యాపారాభివృద్ధికి, ఎక్స్‌పో మరింత విజయం సాధించడానికి విస్తృత ప్రచారం ఎంతగానో అవసరమని స్పష్టం చేశారు. ​గాయత్రీ సొసైటీ ఆధ్వర్యంలో వ్యాపారవేత్తల అభివృద్ధికి ఎల్లవేళలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు. ఈ ఎక్స్‌పోలో డాక్టర్లు, అకౌంటెంట్లు, వ్యాపారవేత్తలతో పాటు సుమారు 70 నుంచి 80 మందికి పైగా పారిశ్రామికవేత్తలు భాగస్వాములై తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. మహిళలు యువత వ్యాపార రంగంలో అధికంగా రాణించాలని స్వయంకృషితో అభివృద్ధి చెందాలని సూచించారు. ఎక్స్పో నందు పురాతన నాణ్యాలు, కరెన్సీ ప్రత్యేక ఆకర్షణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో డాక్టర్ జి వి పూర్ణ చందు, డాక్టర్ వి శ్రీనివాస్, గురునాథ్ శర్మ, డాక్టర్ కుంద శ్రీధర్, 23వ డివిజన్ అధ్యక్షులు చల్లా సుధాకర్, జొన్నవిత్తుల సుబ్బారావు, మల్లిక్, మంగళంపల్లి నాగేశ్వరరావులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *