ఎంఎస్ఎంఈ గుర్తింపు, అభివృద్ధి కోసం ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ ఆధ్వర్యంలో స్టేట్ ఎస్ఎంఈ అవార్డ్స్ 2026 సిరీస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) గుర్తింపు, అభివృద్ధి కోసం దశాబ్దానికి పైగా కృషి చేస్తున్న సంస్థ ఇండియా ఎస్ఎంఈ ఫోరం ఆధ్వర్యంలో స్టేట్ ఎస్ఎంఈ అవార్డ్స్ 2026 సిరీస్‌ను నిర్వహిస్తున్నట్లు ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ తెలిపింది. గురువారం ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ అధ్యక్షులు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. భారతదేశపు ప్రముఖ జాతీయ గుర్తింపు వేదిక ఇండియా ఎసఎంఈ ఫోరమ్, యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మక గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అనే ఏడు రాష్ట్రాల శ్రేణిపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. ఏడు రాష్ట్రాల కార్యక్రమంలో రెండవ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన టాప్ 50 ఎస్ఎంఈలను గుర్తించటం ద్వారా స్టేట్ ఎస్ఎంఈ అవార్డ్స్ 2026 సిరీస్ నిర్వహిస్తుందన్నారు. ఎంపికైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టాప్ 50 ఎసఎంఈ లను ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహించు వేడుకలో సత్కరిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపికైన టాప్ 50 ఎసఎంఈలు ప్రతిష్టాత్మకమైన ఇండియా ఎసఎంఈ 100 అవార్డులకు నామినేషన్ పొందుతాయన్నారు. యాక్సిస్ బ్యాంక్ కమర్షియల్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ విజయ్‌శెట్టి మాట్లాడుతూ… ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, ఉపాధిని సృష్టిస్తూ, సాంకేతికతను స్వీకరిస్తూ, ఎగుమతులను విస్తరిస్తూ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడుతున్న తయారీ, సేవలు, వాణిజ్య రంగాలలోని ఎంఎసఎంఈలను గుర్తిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ 50 ఎసఎంఈల సమగ్ర గుర్తింపు మరియు అభివృద్ధి వేదికగా ఇది సంస్థల పోటీతత్వాన్ని బలోపేతానికి మరియు వృద్ధిని వేగవంతం చేయుటకు ఎంతో తోడ్పడుతుందన్నారు. ఈ సమావేశంలో ఐఎస్ఎంఈ ప్రతినిధులు సుష్మ మార్టనియా, భవ్యశర్మ, షీలా శ్రీనివాస్, పి.కోటేశ్వరరావు, కెవికె కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *