విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ఫిల్మ్ & టివి వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఈరోజు ఎంపి.యన్.జి.ఓ. కార్యాలయం నందు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోసైటి అధ్యక్షులు తోరం రాజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, సినిమా పరిశ్రమ పై అనేక మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ రాష్ట్రంలో పని చేస్తూ ఉన్నామని, తామందరం కలసి సమైక్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం, కో ఆపరేటివ్ యాక్ట్ ప్రకారం హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నామని సభ్యులు అందరికీ స్వంత గృహ స్థలం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ముందుకు వచ్చి కార్మికులు సంక్షేమం శ్రేయాస్సు దృష్టిలో పెట్టుకొని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రముఖ హీరో, శాసన సభ్యులు బాలకృష్ణ నిబద్ధత కు నిదర్శనమని తోరం రాజా కోనియాడారు. త్వరలో వీరికి వినతిపత్రం సమర్పిస్తామని తెలియజేశారు. అలాగే ముఖ్యంగా కార్మికులకు స్వంత గృహ స్థలం అందించాలని, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్స్ ఏర్పాటుకు త్వరిత గతిన కార్యాచరణ చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు కొండపల్లి అప్పారావు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి తీసుకుంటున్న గోప్ప నిర్ణయాలు పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో షూటింగ్స్ సంబంధించి సింగిల్ విండో పర్మిషన్స్ విధాన్నాన్ని వెంటనే అమలు యఫ్.డి.సి. ప్రకటించడం అభినందనియమని బోర్డు ఆఫ్ డైరెక్టర్ బోను వెంకటరావు అన్నారు. ఈ సమావేశంలో బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ పిళ్లా ప్రసాద్ శాంబోలు హరనాథ్, ఇంటూరి మళ్లికార్జున చౌదరి, జె. సరోజినీ, ముళ్లపూడి రాధ, షహనాజ్, పిల్లి అనంత లక్ష్మి, చుండూరు సుర్యకుమారి, చందవోలు బ్రాహ్మణయ్య, బోజ్జా గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News