విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ ఎమ్మెల్సీ అన్నయ్య కొణిదెల నాగబాబు కి ఆంధ్రప్రదేశ్ పర్యావరణ, అటవీ శాఖకు సంబంధించిన గ్రీన్ నిర్వహణ కమిటీ చైర్మన్గా రాష్ట్ర క్యాబినెట్ హోదా లభించిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్ డా. పసుపులేటి హరి ప్రసాద్ విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర హస్తకళా సంప్రదాయానికి, కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే ప్రఖ్యాత బొబ్బిలి వీణను అన్నయ్య కొణిదెల నాగబాబు కి అందజేసి అభినందనలు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన నూతన బాధ్యతల్లో అన్నయ్య కొణిదెల నాగబాబు విజయవంతంగా రాణించాలని, పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ, పచ్చదనం పెంపు, ప్రకృతి వనరుల పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని డా. పసుపులేటి హరి ప్రసాద్ ఆకాంక్షించారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యత కల్పిస్తూ, సుస్థిర అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు గ్రీన్ నిర్వహణ కమిటీ ద్వారా మరింత బలం చేకూరాలని ఆయన పేర్కొన్నారు. అన్నయ్య కొణిదెల నాగబాబు కి లభించిన ఈ కీలక బాధ్యత రాష్ట్రానికి, పర్యావరణ పరిరక్షణకు, ప్రజా సంక్షేమానికి మరింతగా ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ డా. పసుపులేటి హరి ప్రసాద్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News