విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
64వ డివిజన్ కండ్రిక మెయిన్ రోడ్డు బస్టాప్ వద్ద నుండి బుధవారం రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు ఇంటింటికి వెళ్లి ప్రజలతో ఆత్మీయంగా మమేకం అయ్యారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా 21 డివిజన్లలో మా టీడీపీ నాయకులు, ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకుంటున్నారని…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు దూరంగా కాకుండా ప్రతి ఇంటి గడప తొక్కుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నామని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని…
NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచామని, వృద్ధులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000, మంచానికే పరిమితమైన వారికి రూ.10,000, తలసేమియా బాధితులకు రూ.15,000 చొప్పున పెన్షన్లు అందిస్తున్నామని, ప్రతి నెలా తెల్లవారుజామునే వృద్ధుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించడం ద్వారా ప్రభుత్వం పేదల పట్ల తన బాధ్యతను చాటుకుంటోందని…
మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని, “తల్లికి వందనం” పథకాన్ని పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి బిడ్డకు వర్తింపజేస్తున్నామని, అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు తక్కువ ధరకే భోజనం అందిస్తున్నామని…
“అధికారం మాకు అలంకారం కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత” అనే భావనతో పనిచేస్తున్నామని కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి సహాయనిధి సాయం అందిస్తున్నామని తెలిపారు.
సెంట్రల్ నియోజకవర్గంలో ఇంటింటికీ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నామని, రాబోయే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేయడం ఖాయమని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లో 64 వ డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవి కుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్ కె బాబు, బ్యాంక్ చైర్మన్ సాధం శ్రీనాథ్, బ్యాంకు డైరెక్టర్లు పొన్నం శేషగిరి, శంకర్ రెడ్డి, యూనిట్ ఇన్చార్జిలు కాకొల్లు వరలక్ష్మి, నాగేశ్వరి, కోమరి రాజేష్, కే హర్ష సాయి, బూత్ కన్వీనర్, కంకణాల బాబు, కోరాడ రమణ, కుప్పిలి రమణ, తిరుపతి రావు, నల్లిపోగు కన్నా, సుందర్ రావు, టిడిపి నాయకులు పొట్నూర్ అప్పలనాయుడు, పొట్నూరి సూర్యనారాయణ, రాజ్ కుమార్, sk ఖాజా, వంశీ, sk,హుసేన్ రమేష్, పండు, తిరుపతిరావు, మహిళా నాయకులు పుప్పాల భాను, తేజ, జనసేన నాయకులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News