-సికింద్రాబాద్ వేదికగా సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులతో సమావేశం
-సమావేశానికి హాజరైన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని
-జగ్గయ్యపేట నూతన రైల్వే లైన్, కొత్త రైలు సేవలు మరియు జగ్గయ్యపేట రైల్వే స్టేషన్ యొక్క మౌళిక సదుపాయాలు ప్రయాణికుల సౌకర్యాల ఫై సమావేశంలో ప్రశ్నించిన ఎంపీ చిన్ని
-జగ్గయ్యపేట రైల్వే స్టేషన్ను అన్ని విధాల అభివృద్ధి నూతన రైల్వే లైన్, కొత్త రైల్వే సేవలు ఫై గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే
-ఎంపీ చిన్ని తో పాటు సమావేశంలో పాల్గొన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య)
సికింద్రాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
సికింద్రాబాద్ వేదికగా 18 మంది పార్లమెంట్ సభ్యులతో సౌత్ సెంట్రల్ రైల్వే వారు నిర్వహించిన సమావేశంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి నూతన రైల్వే లైన్ కొత్త రైల్ సేవలు రైల్వే స్టేషన్ మౌలిక సదుపాయాలు ప్రయాణికుల సౌకర్యాలు వంటి అంశాలపై ఎంపీ చిన్ని సమావేశంలో చర్చించారు ఈ సమావేశంలో ఎంపీ చిన్ని తో పాటు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్( తాతయ్య) పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ జగ్గయ్యపేట రైల్వే స్టేషన్, రైల్వే లైన్ కొత్త రైల్ సర్వీస్ వంటి మూడు ప్రధానమైన అంశాలను సౌత్ సెంట్రల్ రైల్వే ముందు ఉంచినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మొదటి అంశంగా కాచిగూడ జగ్గయ్యపేట కొత్త రైల్వే లైన్ పై ఎంపీ చిన్ని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను అడుగగా రైల్వే అధికారులు సమాధానం ఇస్తూ కాచిగూడ జగ్గయ్యపేట కొత్త రైల్వే లైన్ సుమారు 228 కిలోమీటర్ల పొడవుతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డి పి ఆర్ ) రూపకల్పన సైతం తుది దశకు చేరుకుందని అన్నారు. హైదరాబాదు నుండి ఏపీలోని పారిశ్రామిక ప్రాంతమైన జగ్గయ్యపేటకు ప్రయాణ దూరం సమయం ఈ ప్రాజెక్టు పూర్తయితే తగ్గనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రవాణా వాణిజ్యం కార్గో రవాణా రంగాలు అభివృద్ధి చెందనున్నాయి, ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి పలు నూతన రైల్వేస్టేషన్లో సైతం ఏర్పాటు అయ్యే అవకాశం ఉందిఅని తెలిపారు
మరోవైపు రెండవ అంశంగా ఎంపీ చిన్ని జగ్గయ్యపేట రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యాలపై రైల్వే అధికారులను అడగగా రైల్వే అధికారులు సమాధానం ఇస్తూ జగ్గయ్యపేట రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాలు, స్టేషన్ మౌలిక సదుపాయాల సమగ్ర ఉన్నతీకరణను ప్రస్తుతం కొనసాగుతున్న మోటమర్రి- విష్ణుపురం డబ్లింగ్ పనుల పరిధిలోకి చేర్చడం జరిగిందని కోరిన సౌకర్యాలైన అప్రోచ్ రోడ్ బుకింగ్ కౌంటర్ సౌకర్యాల మెరుగుదల మరియు ఇతర కనీస అవసరమైన సౌకర్యాల కల్పన పనులను డబ్లింగ్ పనులతో పాటే క్రమ పద్ధతిలో అమలు చేసి పూర్తి చేయడం జరుగుతుందని తెలియజేశారు
మూడో ప్రధానమైన అంశంగా మోటమర్రి-జగ్గయ్యపేట- విష్ణుపురం రైల్వే లైన్ లో తగిన పాసింజర్ రైలు సర్వీసులను ప్రవేశపెట్టాలని ఎంపీ చిన్ని రైల్వే అధికారులను అభ్యర్థించగా రైల్వే అధికారులు మాట్లాడుతూ మోటమర్రి-జగ్గయ్యపేట- విష్ణుపురం రైల్వే లైన్ ప్రస్తుతం కేవలం సరుకు రవాణాకు మాత్రమే అనువుగా ఉందని ప్రయాణికుల రైళ్ళను నడపాలంటే సామర్ధ్య భద్రత మెరుగుదల పనులతో మౌలిక సదుపాయాలను ఉన్నతీకరించాల్సి ఉందని అన్నారు. మంజూరైన డబ్లింగ్ పనులతో పాటు ఈ ప్రక్రియను కూడా జరుగుతుందని తెలియజేశారు ఈ మూడు ప్రధానమైన అంశాలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల ముందు ఎంపీ చిన్ని ఉంచారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కర్నూలు ఎంపీ నాగరాజు, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవత్సవ, మరియు తెలంగాణ ఎంపీలు, రైల్వే అధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News