విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నోవాటెల్ పికిల్ & బ్రూ కోర్ట్ నందు యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (USO) ఆధ్వర్యంలో నిర్వహించిన పికిల్ బాల్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా జరిగింది.
ఈ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. పికిల్ బాల్ వంటి నూతన క్రీడలకు యువతలో ఆదరణ పెరగడం అభినందనీయమని తెలిపారు.అనంతరం సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన సుమంత్ దేవరపల్లి, రన్నర్‌గా నిలిచిన యస్వంత్కు దేవినేని అవినాష్ ప్రైజ్‌లు అందజేసి అభినందించారు.టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (USO) నిర్వాహకులను, పాల్గొన్న క్రీడాకారులను దేవినేని అవినాష్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా కార్యక్రమాలను నిర్వహించి యువతను ప్రోత్సహించాలని ఆయన ఆకాంక్షించారు.SRM యూనివర్సిటీ విద్యార్థులు పర్వతనేని నాగేంద్ర,ప్రత్తిపాటి మణికంఠ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News