ఉన్నత పాఠశాల లు గా అప్గ్రేడ్ చేయబడిన పాఠశాల లకు వాచ్ మెన్ లను నియమించండి… : ఆప్టా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం అధికారం లో వచ్చిన తర్వాత విద్యా సంస్కరణ లో భాగంగా విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల లను ఉన్నత పాఠశాలలు గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అప్గ్రేడ్ కాబడి సంవత్సరం పూర్తి కాబడిన ఆ పాఠశాల లకు ఇంత వరకు వాచ్ మెన్ లను నియమించ లేదు అని వెంటనే వాచ్ మెన్ లను నియమించాలి అని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్ రావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం జి మెహది డిమాండ్ చేశారు. ఈ పాఠశాల ల యందు అధునాతన ప్యానెల్ టి వి లు మరియు కంప్యూటర్ లు ఇతరత్రా విలువైన వస్తువులు ఉన్న పాఠశాల ల యందు రక్షణ కొరకు నైట్ వాచ్ మెన్ లను నియమించవలసిన అవసరం ఉంది అని వారు వ్రాత పూర్వకంగా ఇది వరకే విద్యా శాఖ అధికారులను కోరడం జరిగింది, కానీ ఇంత వరకు స్పందన లేదని అందువలన మరొక మారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మరియు విద్యా శాఖ అధికారులను లేఖ సంఖ్య 92/ ఆప్టా స్టేట్/2026 ద్వారా ప్రాతినిధ్యం చేయడం జరిగిందని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్ రావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం జి మెహది తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *