విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్ నాలుగు స్తంభాల సెంటర్లో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం, SIR కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డివిజన్లోని ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని బుద్ధా వెంకన్న హామీ ఇచ్చారు. అదేవిధంగా SIR కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితాను పరిశీలించి, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువై, ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శివ శర్మ, గుండవరపు హరి బాబు, రేగళ్ల లక్ష్మణ బడుగు గణేష్, ఖండవల్లి సాంబశివయ్య, నక్క కృష్ణ, నేరల నవీన్, కె తేజ, అబ్బాయి, గుణశేఖర్, R రవి కుమార్, దేవరాజు, నక్క వెంకట్రామయ్య, పమిడిమర్రు లోకేష్ విజయ్ కుమార్, గన్నవరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News