అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 సంవత్సరం కన్నా ముందు ఉపాధ్యాయులుగా నియమించబడి ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారందరూ తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణత సాధించవలసిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ యాజమాన్యం (ప్రభుత్వ / స్థానిక సంస్థ / APREIS / ప్రభుత్వ సంక్షేమ సంఘాల రెసిడెన్షియల్ / AP మోడల్ పాఠశాలలు / ప్రైవేట్ ఎయిడెడ్ / ఇతర ప్రభుత్వ) పాఠశాలలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించడమైనది. ఈ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ 24.08.2026 వ తేదీన విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులకు తెలియజేయడమేమనగా, టెట్ నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను మరియు సిలబస్ http://cse.ap.gov.in / tet2dsc.apcfss.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. వాటిని పూర్తిగా చదివి, అర్థం చేసుకున్న అనంతరం, తేదీ 25.08.2026 నుండి 24.09.2026 వరకు ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయడమైనది.
అక్టోబర్ నెల 05 వ తేదీ నుండి హాల్ టికెట్లు http://cse.ap.gov.in / tet2dsc.apcfss.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ప్రత్యేక టెట్ పరీక్షలు 11.10.2026 వ తేదీ నుండి 21.10.2026 వ తేదీ వరకు ఉదయం మరియు మధ్యాహ్నము కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించబడును. అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉన్నా డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయము నందు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ఈ క్రింది నంబర్లకు సంప్రదించవచ్చును. హెల్ప్ డెస్క్ అన్ని పని దినములలో ఉదయము 10.00 నుండి సాయంత్రము 5.30 వరకు పని చేయును.
Prajavartha Online Telugu News