సెప్టెంబర్ 1,2,3 నెల్లూరులో జరిగే DYFI రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో నెల్లూరులో జరిగే DYFI ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని యువతకు డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం విజయవాడ బాలోత్సవ భవన్ లో డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు వై. రాము, జి. రామన్న మాట్లాడుతూ యువజనోద్యమ రథసారధి డివైఎఫ్ఐ రాష్ట్ర మహసభలు నెల్లూరు వేదికగా సెప్టెంబర్ 1,2,3 తేదీలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసిన జాబ్ క్యాలెండర్ లో కేవలం 10,060 పోస్టులతో తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపారు. లోకేష్ పాదయాత్రలో ఖాళీ పోస్టులు విడుదల చేస్తామని ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారని కేవలం 16 వేల పోస్టులతో ఒక్క డీఎస్సీ తప్పా ఇంకేవీ విడుదల చేయలేదని అన్నారు.నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదన్నారు. ఎస్సై పోలీస్ కానిస్టేబుల్ 11,639 పోస్టులకు పెంచకపోతే రాష్ట్రంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డీఎస్సీ పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున వయోపరిమితి 47కు పెంచాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల ఏర్పాటు పేరుతో పెద్ద పెద్ద కార్పొరేట్లకు వేల ఎకరాల భూములు సేకరించి ఇస్తున్నారని యువతకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదని అన్నారు. స్థానికంగా ఉన్న పరిశ్రమలో స్థానిక యువతకు 75% ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన హామీలు అమలు కోసం, ఖాళీ పోస్టుల భర్తీ కోసం, యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయి మాఫియా నిర్ములనకై డివైఎఫ్ఐ రాబోయే కాలంలో పోరాడుతుందని తెలిపారు. యువత హక్కుల కోసం, ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం నెల్లూరులో జరిగే DYFI రాష్ట్ర మహాసభలు వేదికగా చర్చిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి వీరనాల శివకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఎఫ్ బాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు నరసింహ, అబ్దుల్లా రాఘవేంద్ర, చిన్ని, శివ, పిచ్చయ్య, కృష్ణకాంత్, శివ, అంజనేయరాజు, శివ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *