-యువత బాగా కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి…మంత్రి
-10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్–2026 విడుదలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
యువత కలలు కన్న భవిష్యత్ ను చంద్రబాబు నాయుడు గారు సాకారం చేస్తున్నారని, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు అందించడం పట్ల రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్–2026 విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ఆయన సంతోషంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. నాలుగు దశల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పలు ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడనున్నాయని పేర్కొన్నారు.
జాబ్ క్యాలెండర్లో గ్రూప్–1, గ్రూప్–2తో పాటు పోలీసు, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్థక, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారని తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి అన్నారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని బాగా కష్టపడి పోటీ పరీక్షలకు సిద్ధమై ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి అంకితభావంతో సేవలందించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు యువతకు పిలుపునిచ్చారు. జాబ్ క్యాలెండర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను goir.ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని తెలిపారు.
Prajavartha Online Telugu News