-బీసీ రిజర్వేషన్లపై జగన్‌ది రాజకీయ మోసం..
-కూటమిది చట్టబద్ధమైన సామాజిక న్యాయం
-స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పై జగన్ లో అప్పుడే మొదలైన వణుకు
-మంత్రి సత్యకుమార్ ధ్వజo
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వెన్నుపోటు, విశ్వాసఘాతుకం అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇతరులకు నీతులు చెప్పడం హాస్యాస్పదమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రను మర్చిపోయి ఇతరులపై నిందలు వేయడం జగన్ రాజకీయ కపటత్వానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. “కుటుంబంలోనే తల్లి, సోదరితో బహిరంగంగా వెలుగుచూసిన విభేదాలు, బాబాయ్ హత్య కేసు చుట్టూ కొనసాగుతున్న పరిణామాలు ప్రజలకు తెలియని విషయాలు కావు. వీటిపై సమాధానం చెప్పకుండా ఇతరులకు నీతులు చెప్పడం జగన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనo వెన్నుపోటు అనే పదాన్ని పదేపదే పలికినంత మాత్రాన జగన్ గతం మారదు. చరిత్రను మైక్‌తో మార్చలేరు. ప్రజల జ్ఞాపకాలను ప్రెస్మీట్లతో చెరిపేయలేరు. జగన్‌గారూ.. ఇతరులకు నీతులు చెప్పే ముందు మీ రాజకీయ చరిత్రను ఒకసారి అద్దంలో చూసుకోండి” అని జూనియర్ డాక్టర్ల స్టైప్oడ్ వ్యవహారంలో జగన్ వైఖరిని సత్యకుమార్ దుయ్యబట్టారు.
తప్పుడు ప్రచారంతో ప్రజల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం
“బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ చేస్తున్న ప్రచారం ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించే ప్రయత్నమే.
రిజర్వేషన్ ప్రకటించామని చెప్పుకోవడం కాదు.. అది న్యాయపరంగా నిలబడేలా చేయడమే అసలైన చిత్తశుద్ధి. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ నిర్ణయం న్యాయపరమైన చిక్కుల్లో పడిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. కూటమి ప్రభుత్వం మాత్రం బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా, న్యాయపరంగా నిలబడేలా చర్యలు తీసుకుంటోంది. బీసీలకు హక్కులు కల్పించడం, వారి ప్రాతినిధ్యాన్ని పెంచడం, వారికి గౌరవం కల్పించడం మా ప్రభుత్వ బాధ్యత. బీసీలను ఓటు బ్యాంకుగా చూసింది జగన్.. ఎన్నికల సమయంలో బీసీల పేరు చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం మాత్రం బీసీలను పాలనలో భాగస్వాములుగా చూస్తోంది. ఎన్నికల పోటిలో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది.”అని సత్యకుమార్ అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై జగన్ లో ఆందోళన.. కారణాల కోసం కసరత్తు
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి కళ్ల ముందు కనబడుతుడడంతో జగన్ లో అప్పుడే ఆందోళన కనిపిస్తోంది. త్వరలో తనకు ఎదురయ్యే ఓటమికి కారణాలు వెతుక్కోవడానికి జగన్ ఇప్పటినుంచే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. జగన్ పాలనలో మాదిరిగా కాకుండా కూటమి ప్రభుత్వ హయాంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయి. ప్రజలు కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారు. ” అని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News