హైకోర్టు ఆదేశాల మేరకు రేపు “స్టైఫండ్” పెంపు అంశంపై ఉన్నత స్థాయి కమిటీ భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం జూనియర్ వైద్యుల స్టైపెండ్ పెంపుపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరగనుంది. స్టైపెండ్ పెంపుపై పరిశీలన, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీర పాండ్యన్ ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించనున్నారు. వైద్య విద్య సంచాలకులు సభ్య కన్వీనర్‌గా డాక్టర్ విష్ణువర్ధన్, సెకండరీ హెల్త్ సంచాలకులు చక్రధర్ బాబు, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ఏపీ జూడా అధ్యక్షుడు/కార్యదర్శి తదితరులు కమిటీ సభ్యులుగా ఉన్నారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశo
గురువారం సాయంత్రం జరిగనుoది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *