గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా అధికారులు సిద్దంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో మౌళిక వసతులపై నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లుపై సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియకు సిద్దంగా ఉండాలని, వార్డ్ ల వారీగా పోలింగ్ కేంద్రాల పరిధిలోని డోర్ నంబర్లపై పట్టణ ప్రణాళిక టిపిబిఓలు, ఆర్ఐలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, అందుకు తగిన విధంగా వార్డ్ లు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఎలక్షన్ సెల్ సూపరిండెంట్ ని ఆదేశించారు. అలాగే రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్లకు హాల్స్ ని గుర్తించాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మెటీరియల్ ని తెప్పించడానికి మేనేజర్ చర్యలు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. సర్ విచారణపై వివరాలు అడిగి తెలుసుకొని, ప్రతి నోటీసుని క్షుణ్ణంగా పరిశీలించి, విచారణ చేయాలని, ఏఈఆర్ఓలు పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్ జి.సాంబశివరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఏసిపీ రెహ్మాన్, డిప్యూటీ తహశీల్దార్లు నాగ మల్లేశ్వరరావు, కిరణ్మై, మేనేజర్ బాలాజీ బాష పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News