APCRDA ఉద్యోగులకు CPR చేసే విధానంపై శిక్షణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే ప్రాథమిక CPR (Cardiopulmonary Resuscitation) నైపుణ్యాలపై APCRDA ఉద్యోగులకు గురువారం, ఆగస్టు 27న రాజధాని అమరావతిలోని రాయపూడి ప్రాజెక్ట్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. APCRDA సోషల్ డెవలప్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో, AIIMS వైద్య నిపుణుల సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సడన్ కార్డియాక్ అరెస్ట్ (Sudden Cardiac Arrest – అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం) వంటి అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందేలోపు CPR ఎలా చేయాలి, బాధితులకు తక్షణ సహాయం ఎలా అందించాలి అనే అంశాలపై ఉద్యోగులకు నిపుణులైన వైద్య బృందం అవగాహన కల్పించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో మంగళగిరి AIIMS వైద్య నిపుణులు డాక్టర్ రాజీవ్ ఏ., ప్రొఫెసర్ & హెడ్, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగం, డాక్టర్ ప్రత్యూష టీ., అసోసియేట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్ విభాగం, డాక్టర్ అంజని ప్రియ వి., అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం, అలాగే కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగానికి చెందిన సీనియర్/జూనియర్ రెసిడెంట్లు శిక్షణ అందించారు. AHA ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎం.డి. షాజాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శిక్షణలో భాగంగా CPR ప్రాథమిక పద్ధతులను ప్రత్యక్షంగా వివరించడంతో పాటు, ఉద్యోగులతో హ్యాండ్స్-ఆన్ ప్రాక్టీస్ నిర్వహించారు. అత్యవసర సమయంలో భయపడకుండా, సరైన సమయంలో సరైన విధంగా స్పందించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు తెలిపారు. శిక్షణకు హాజరైనవారు అడిగిన ప్రశ్నలకు AIIMS వైద్య బృందం సమాధానాలు ఇచ్చారు. APCRDA సోషల్ డెవలప్‌మెంట్ విభాగం గ్రూప్ డైరెక్టర్ వి. రాములు, డిప్యూటీ డైరెక్టర్ జె. మోహన్‌రావు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 110 మందికిపైగా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఇటువంటి అవగాహన, శిక్షణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తామని గ్రూప్ డైరెక్టర్ వి. రాములు ఈ సందర్భంగా తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *