విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (పీటీడీ) కమిషనర్‌గా మరియు ఏపీఎస్‌ఆర్టీసీ ఎక్స్-అఫీషియో వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎం. శివప్రసాద్ కు ప్రభుత్వం ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది.
ప్రస్తుతం ఆయన ఏపీఎస్‌ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు రవాణా, రహదారులు మరియు భవనాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఆయన ఈ అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏపీపీటీడీ కార్మికపరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వి. శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాసరావు రాష్ట్ర కోశాధికారి కోసూరి సురేంద్ర తదితరులు మర్యాద పూర్వకంగా కలిసిన వారిలో ఉన్నారు.
Prajavartha Online Telugu News