యర్రగొండపాలెం ఘటనపై విచారణ జరుపుతాం

-అనధికార వైద్య చర్యల (Quackery)ను ఉపేక్షించేది లేదు
-రాష్ట్ర వైద్య మండలి అధ్యక్షుడు డాక్టర్ నంద కిశోర్ వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో అనధికారికంగా నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్న అబార్షన్ వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటనపై విచారణ జరుపుతామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. వైద్యుడు ఫోన్‌లో సలహాలు ఇస్తుండగా, సిబ్బందితో అబార్షన్ ప్రక్రియ నిర్వహించినట్లు వచ్చిన వార్తలపై కౌన్సిల్ స్పందించింది.
మండలిలో అంతర్భాగంగా ఉన్న యాంటీ క్వాకరీ కమిటీ ద్వారా ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించి, కౌన్సిల్‌కు ఉన్న అధికారాల మేరకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ గార్లపాటి నంద కిశోర్ తెలిపారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

అలా చేయడం చట్ట విరుద్ధం

“అనధికార వైద్యచర్యలు (Quackery), అక్రమ వైద్య ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఇప్పటికే ఏర్పాటైన యాంటీ క్వాకరీ కమిటీకి డాక్టర్ సుబ్బా నాయుడు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. నకిలీ వైద్యం అందించే వారిని గుర్తించి,తగిన చట్టపరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులతో కమిటీ సమన్వయంతో పనిచేస్తుంది.
ఆధునిక వైద్యం అందించడానికి, మందులు సూచించడానికి, అబార్షన్ వంటి వైద్య ప్రక్రియలు నిర్వహించడానికి సంబంధిత వైద్య విద్యార్హతలతో పాటు చెల్లుబాటు అయ్యే వైద్య రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. అవసరమైన వైద్య అర్హతలు, చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ లేకుండా ఆధునిక వైద్య విధానాన్ని నిర్వహించడం చట్టవిరుద్ధమని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చట్టంలోని సెక్షన్ 20, నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం–2019లోని సెక్షన్ 34 స్పష్టం చేస్తోంది. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే అనధికార వైద్యచర్యలు (Quackery), అక్రమ వైద్య ప్రాక్టీస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోo”‘ అని కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ గార్లపాటి నంద కిశోర్ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *