విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తన నియోజకవర్గ పరిధిలో వివాహం చేసుకుంటున్న నూతన దంపతులకు ప్రత్యేకంగా ‘సుజనా పెళ్లి కానుక’ అందిస్తూ అభినందనలు తెలుపుతున్నారు. వివాహ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు పంపిన కుటుంబాలకు చీర, వరుడికి ప్యాంటు-షర్ట్, స్వీట్ బాక్స్‌తో పాటు పసుపు, కుంకుమలను కానుకగా అందజేస్తున్నారు. 41వ డివిజన్, మసీద్ స్ట్రీట్ కు చెందిన చెందిన అబ్దుల్ గఫార్ (లేటు ), గౌసియా దంపతుల కుమార్తె అబ్దుల్ కౌసర్ వివాహం షేక్ అబుబకర్ తో ఆదివారం , మౌలానగర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే కార్యాలయం తరపున సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొని నూతన వధూవరులకు ‘సుజనా పెళ్లి కానుక’ అందజేశారు. కొత్త జంట సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ వారు శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News