డి.ఈ.ఈ నాగభూషణం విధులను ఎంతో నిబద్దతతో నిర్వహించారు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థలో హెడ్.డి గా విధులు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న డి.ఈ.ఈ నాగభూషణం భవిష్యత్ లో ఆయురారోగ్యాలతో జీవించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆకాక్షించారు. సోమవారం కౌన్సిల్ సమావేశ మందిరం నందు నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న డి.ఈ.ఈ నాగభూషణంకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సభకు కమిషనర్ ముఖ్య అతిధిగా హాజరయ్యి సన్మానించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, డి.ఈ.ఈ నాగభూషణం నగర పాలక సంస్థలో హెచ్.డి గా తన విధులను ఎంతో నిబద్దతతో నిర్వహించారన్నారు. ఉద్యోగ జీవితమంత క్రమశిక్షణ, నిబద్దతతో సాటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారని, నేటి యువ ఉద్యోగులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అలాగే భవిషత్ లో ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం వారిని సన్మానించి, శాలువాతో సత్కరించారు.
సదరు కార్యక్రమంలో ఇంచార్జ్ అదనపు కమిషనర్ సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్ పబ్లిక్ హెల్త్ యస్.ఈ దాసరి శ్రీనివాసరావు, జియంసి యస్.ఈ సుందర్రామి రెడ్డి, బి. శ్రీనివాసరావు, ఈ.ఈ లు, డి.ఈ.ఈ లు విభాగాల అధకారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *