విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్నకార్ల వర్కర్స్ యూనియన్ టాక్సీ స్టాండ్ (లెనిన్ సెంటర్) పరిధిలో వినాయక చవితి మహోత్సవాన్ని యూనియన్ సభ్యులందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అలంకార్ సెంటర్ ధర్నాచౌక్ పక్కన చిన్నకార్ల వర్కర్స్ యూనియన్ టాక్సీ స్టాండ్ ప్రెసిడెంట్ సయ్యద్ బాబు, మీడియాతో మాట్లాడుతూ గత 53 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ వేడుకలను జరుపుకుంటూ ఈ ఏడాది 54వ వార్షిక ఉత్సవాలను జరుపుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలను కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగా 1,500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే రేపు మధ్యాహ్నం 2:00 గంటలకు వినాయక నిమజ్జన కార్యక్రమం జరగనుందని యూనియన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ చిట్టూరి నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఎల్ రామకృష్ణ, జాయింట్ సెక్రెటరీ రమణ కుమార్, కోశాధికారి షఫీ ఉల్లాఖాన్, యూనియన్ సభ్యులు మరియు భక్తులు వందలాదిగా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News