వీధి దీపాలకు సంబంధించి ప్రతి ఫిర్యాదునూ 48 గంటల్లో పరిష్కారానికి చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వీధి దీపాలకు సంబంధించి ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదునూ 48 గంటల్లో పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా నగరంలో రాత్రి సమయాల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వీధి దీపాల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశామని, అందులో భాగంగా జిఎంసి కాల్ సెంటర్ కి, లేదా క్షేత్ర స్థాయి అధికారికి ఫిర్యాదు అందిన 48 గంటల్లోగా పరిష్కారం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలో 35 వేల ఎల్ఈడీ లైట్లు ఉన్నాయని, వాటికి సంబంధించి అవసరమైన డ్రైవర్లు, ఇతర సామాగ్రిని సిద్దంగా ఉంచామని తెలిపారు. ఫిర్యాదుని బట్టి డ్రైవర్లు మార్చడం, వైరింగ్ సమస్యలను సరిచేయడం వంటి పనులను టెక్నీషియన్లు ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారన్నారు. సాయంత్రం వేళల్లో నగరంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ, పనిచేయని వీధి దీపాలను గుర్తించి ఉదయాన్నే బాగు చేయడం ద్వారా వీధి దీపాల వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *