-ఆధ్యాత్మిక శోభతో వైభవంగా వినాయక చవితి వేడుకలు
-వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణంలో పాల్గొన్న మాజీ మంత్రి
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నందిగామ వాసవి మార్కెట్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడిని సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడిని ధనముతో అత్యంత సుందరంగా అలంకరించి ఆధ్యాత్మిక శోభతో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం వాసవి మార్కెట్‌లో వైభవంగా నిర్వహించిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో దేవినేని ఉమా పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు దేవినేని ఉమామహేశ్వరరావును కలిసి అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News