-14 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు – 10వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అర్హత
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 9:00 గంటలకు విజయవాడ కేబిన్ కాలేజ్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ జాబ్ మేళాలో సుమారు 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొనేందుకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువతీ యువకులు అర్హులని అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.12,000 నుంచి రూ.50,000 వరకు వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఆసక్తి మరియు తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు ముందుగా https:// naipunyam.ap.gov.in వెబ్సైట్లో తమ పూర్తి వివరాలతో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, ఆధార్ కార్డు, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్, పాన్ కార్డు, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలని తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 9700092606, 9700025833, 8712495530 సెల్ నంబర్ల నందు సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
Prajavartha Online Telugu News