-12 వేల మంది భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ.. ముఖ్య అతిథిగా పాల్గొన్న బొండా రవితేజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడలోని 66వ డివిజన్ దావు బచ్చయ్య కాలనీలో ఉన్న శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆలయ ధర్మకర్త చింతపల్లి కనకరావు ఆధ్వర్యంలో సుమారు 12 వేల మంది భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా రవితేజ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులతో ఆయన మమేకమయ్యారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చింతపల్లి కనకరావు, ఆలయ నిర్వాహకులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News