Breaking News

మండపేటలో స్థానిక ఎన్నికలపై దేవినేని ఉమా కీలక సమాలోచనలు

-ఎన్నికల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
-అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రధాన అజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని నేతల పిలుపు

మండపేట, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయమే లక్ష్యంగా ముందుకు సాగేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు మండపేట నియోజకవర్గంలో కీలక సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మండపేట మండల పార్టీ నాయకులు, క్లస్టర్, మున్సిపాలిటీ నాయకులు పాల్గొని ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా చర్చించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, గ్రామాలు, వార్డుల వారీగా ఎన్నికల కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలపై నేతలు సమాలోచనలు జరిపారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందిస్తూ సమష్టి కృషితో ఎన్నికల్లో విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలని చర్చించారు.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా చేకూరుతున్న ప్రయోజనాలను వివరించాలని, పార్టీపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పట్టణ వార్డుల వరకు పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందించడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను అమలు చేయడం, ప్రజల మద్దతును కూడగట్టడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని, అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రధాన అజెండాగా చేసుకుని ప్రజాక్షేత్రంలో చురుకైన పాత్ర పోషించాలని సమావేశంలో చర్చించారు. సమష్టి కృషి, సమన్వయం, పక్కా ప్రణాళికతో ఎన్నికలకు సిద్ధం కావాలని నేతలు దిశానిర్దేశం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ …