రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త:
దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శ్రీరామనగర్లోని గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ గారి నివాసంలో నిర్వహించిన చండీ హోమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా టిడిపి అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లోకకల్యాణం, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.
Prajavartha Online Telugu News