విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 54వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా శీరంశెట్టి పూర్ణచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముందుగా విఘ్నేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం సి.ఎస్.ఐ. చర్చిలో ప్రార్థనలు చేసి దైవాశీస్సులు పొందారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా వార్డు సచివాలయానికి చేరుకున్న శీరంశెట్టి పూర్ణచంద్రరావు, రిటర్నింగ్ అధికారి అంజయ్యకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యదర్శి మైనారిటీ బాజీ బాబా, క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు బాలరాజు, రమేష్ రాజు, సుభాని ఖాన్, దుర్గాభవాని, మార్క్, గాలిబ్, చిట్టు, జీవన్, మోసిన్, రాజశేఖర్, సోమినాయుడు, ప్రకాష్, ఎలకల బాబు, నాగరాజు, వెంకటలక్ష్మి, స్రవంతి, మోహన్, విజయ్, ఏసు పాదం, భూపతి, శ్రీనివాస్, తిరుమల తదితర వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News