Breaking News

ఇళ్ల స్థల లేఔట్ పెనులు వెంటనే పూర్తి చేయండి : జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మధ్యతరగతి ప్రజల కోసం చేపట్టిన ఇళ్ల స్థలాల లేఔట్ పనులను వెంటనే పూర్తి చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. గన్నవరం మండలంలోని వి. ఎన్ .పురం, పురుషోత్తపట్నం గ్రామాలలో మధ్య తరగతి ప్రజల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాల లేఔట్ పనులను శనివారం అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాధవీలత మాట్లాడుతూ లేఔట్ పనులను వెంటనే పూర్తి చేయాలనీ, లేఔట్ లలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట నూజివీడు రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి, తహసీల్దార్ నరసింహారావు, ఇతర రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *