కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నివారణ శాఖా మంత్రి డా. తానేటి వనిత ను మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ కలిసారు. ఆదివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత కొవ్వూరు లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో హోం మంత్రి డా. తానేటి వనిత ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్బంగా నూతన జిల్లా ఏర్పాటు నేపథ్యంలో జిల్లాలో పరిపాలన, నూతన కలెక్టరేట్, విపత్తు నివారణ తదితర విషయాలు పై మంత్రి చర్చించడం జరిగింది.
Prajavartha Online Telugu News