స్విమ్మర్ పిల్లా దుర్గారావుకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు నగరంలో జరిగిన స్విమ్మింగ్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లా దుర్గారావును ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఆయనను ఘనంగా సత్కరించారు. 100 మీటర్ల బటర్ ఫ్లై, 100 బెస్ట్ స్టోక్ ఈవెంట్లలో తొలి స్థానం., 400 మీటర్ల స్విమ్మింగ్ ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో దుర్గారావు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *