బిక్కవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలందరికి ఇళ్ల పధకంలో భాగంగా 21 ఎకరాలు స్థలంలో 737 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టా లను పంపిణి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అనపర్తి శాసన సభ్యులు సత్తి సూర్యనారాయణ తెలిపారు. సోమవారం సాయంత్రం బలభద్రపురం గ్రామంలో లబ్ధిదారులకు పంపిణి చెయ్యనున్న స్థలాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి ఇంటి కల సాకరం చెయ్యాలన్నారు. మొత్తం 811 మంది లబ్ధిదారులు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వివరించారు. ఆర్డివో ఏ. చైత్ర వర్షిణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News