విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలోని బాలింతలకు బెజవాడ ప్రెస్‌క్లబ్, ఎ.పి. జర్నలిస్ట్ అసోసియేషన్ (ఎ.పి.జె.ఎ.) ప్రతినిధులు చీరలు, పండ్లు సోమవారం పంచిపెట్టారు. బెజవాడ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు చందన మధు మాట్లాడుతూ గడచిన నాలుగేళ్లుగా బాలింతలకు తమ వంతు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. సెంటినీ ఆస్పత్రితో కలిసి బెజవాడ ప్రెస్‌క్లబ్ నగరంలోని జర్నలిస్టులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను తక్కువ చార్జీలకే అందించే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, అతిధులుగా గవర్నమెంట్ ఆస్పత్రి ఇన్‌చార్జ్ వి.విజయలక్ష్మి, విజయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మశీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మలత, ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.వి.ఆర్.కృష్ణంరాజు, డాక్టర్ శ్రీలత లఖంరాజు, విజయలక్ష్మీ సిల్మ్ అధినేత నాగేశ్వరరావు, కృష్ణవేణి హోల్‌సేల్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News