జాతీయ ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభించిన శాప్ ఎండీ ఎన్. ప్రభాకర రెడ్డి


రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరంలో మంగళవారం జాతీయ విలువిద్య పోటీలను ప్రారంభించిన సందర్భముగా శాప్ ఎండీ ఎన్. ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ…. భారత దేశంలో విలువిద్యకు పురాణ కాలం నుంచి ప్రాచుర్యం ఉంది. గురు శిష్యుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఆర్చరీ క్రీడకు భారత ప్రభుత్వం ద్రోణా చార్య, అర్జున వంటి అత్యున్నత పురస్కారాలతో ప్రముఖులను సత్కరిస్తున్న విషయం అందరికి తెలిసిందే అన్నారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఆర్చరీలో ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రా క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారన్నారు. ధనుర్విధ్యకు పుట్టినిల్లు అయిన భారతదేశంలో మన క్రీడాకారులు ఇవాళ ఒలింపిక్స్ నుంచి అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో దేశ ప్రతిష్ఠను నిలబెడుతున్నట్లు పేర్కొన్నారు. శ్యాంసుందర్, కుందా బుజ్జి వంటి వారు తెలుగు గడ్డ మీద విలువిద్యకు ప్రాణం పోశారని చెప్పారు. ప్రస్తుతం జ్యోతి సురేఖ అంతర్జాతీయ ర్యాంకులో మూడోస్థానంలో నిలిచిన తొలి భారతీయురాలు మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కావడం మనకు ఎంతో గర్వకారణం అన్నారు. దేశ కీర్తి ప్రతిష్ఠలు పెంచిన క్రీడా కారులను స్ఫూర్తిగా తీసుకుని మీరంతా ఒలింపిక్స్ లక్ష్యంగా ఆర్చరీ ఆడాలని కోరారు. చారిత్రక నేపథ్యం ఉన్న రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న ఎన్టీపీసీ – చెరుకూరి లెనిన్, ఓల్గా మెమోరియల్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ పోటీలను (12th Mini, Under-14) (4th Kids, under 9) ఈ రోజు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 19 రాష్ట్రాల నుంచి వచ్చిన 305 మంది క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. మీరంతా ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనసారా ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *