ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ పతకాల జోరు.

-ఆర్చరీ లో బంగారు పతకం తో మెరిసిన కుండేరు వెంకటాద్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అండర్-18 (బాలురు మరియు బాలికల) విభాగములో ఈ నెల 3వ తేది నుండి 13 వ తేది వరకు హర్యానాలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 లో భాగముగా ఈరోజు ఆర్చరీ అండర్ 18 బాలుర ఫైనల్ రౌండ్లో కాంపౌండ్ 50 మీటర్స్ విభాగంలో కుండేరు వేంకటాద్రి మహారాష్ట్ర క్రీడాకారుడు పార్థ్ సునీల్ కోడె తో పోటీపడి 144-143 తో బంగారు పతకం కైవశం చేసుకున్నాడు. అలాగే బాలికల 50 మీటర్స్ కాంపౌండ్ విభాగంలో కాంస్య పతక పోరులో మాదాల సూర్య హంస పంజాబ్ క్రీడాకారిణి పర్నీత్ కౌర్ పై 143-141 తో విజయం సాధించి కాంస్య పతకం కైవశం చేసుకుంది. ఈ సందర్భంగా శాప్ విసి&యండి డా. నక్కల ప్రభాకర రెడ్డి గారు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కి ముఖ్య అతిథిగా విచ్చేసి గెలుపొందిన క్రీడాకారులకు పతకాలు బహూకరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *