విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో పేద ప్రజల అభ్యున్నతికి నవరత్నాలు అమలు చేయడంతో పాటు గత ప్రభుత్వం లో మాదిరి దళారులు, లంచాలు లేకుండా వలంటీర్ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పధకాలు అమలు జరుగుతున్నాయని ప్రజలు తమ హర్షం వ్యక్తం చేస్తూ వైసీపీ నాయకులను హారతులు పట్టి స్వాగతిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 11వ డివిజన్,41వ సచివాలయ పరిధిలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుండి బాగయ్య బజార్,అచ్చమ్మ స్ట్రీట్,పుల్లారావు స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో ఇంటినింటికీ వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి వారికి వివరించారు. అదేవిధంగా పధకాల అమలులో వారికి ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా జగన్ గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని,ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు వారి రాజకీయ మనుగడ కోసం డ్రామాలు ఆడుతూ షో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో స్థానిక ఎంపీ కూతురు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని,ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొన్నారని కానీ గెలిచిన తరువాత ఇప్పటివరకు డివిజన్ మోహమే చూడలేదని స్థానిక ప్రజానీకం వాపోతున్నారు అని అవినాష్ ఎద్దేవా చేశారు.వారెన్ని అసత్య ప్రచారాలు చేసిన ప్రజల మద్దతు తమకే ఉందని అందుకు నిదర్శనమే ప్రజలలో వస్తున్న ఈ స్పందన అని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ గారి నాయకత్వం లో భారీ మెజారిటీతో గెలుస్తామని,అవే టీడీపీకి చివరి ఎన్నికలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్,బంకా సందీప్,పటమట దుర్గా ప్రసాద్,చక్రవర్తి,లక్ష్మి,ఇందిర,చోటు రిజ్వాన్,నున్న సాంబశివరావు,స్టాండింగ్ కమిటీ మెంబెర్ రామిరెడ్డి,మాజీ డిప్యూటీ మేయర్ చెల్లారావు, రామాయణపు శ్రీనివాస్, ఉకోటి రమేష్,ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News