మ్యుటేషన్ సవరణలు కోసం అర్హమైనవి 101 దరఖాస్తులు

-కలెక్టర్ కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రీసర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు , మ్యుటేషన్ దరఖాస్తు లను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత తెలిపారు. గురువారం మధ్యాహ్నం విజయవాడ సిసిఎల్ఏ కార్యాలయం నుండి మ్యుటేషన్ సవరణలు – తిరస్కరణలు , ఇతర అంశాలపై కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్లతో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ కె మాధవిలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో మ్యుటేషన్ సవరణలు కోసం మొత్తం 101 దరఖాస్తులు వోచ్చాయని, వాటన్నిటికీ సర్వే నెంబర్లను గుర్తించడం జరిగిందన్నారు. వాటికి సంబంధించి 95 వాటికి ఫారం-8 జనరేషన్ చేశామని తెలిపారు. ఆరు దరఖాస్తు లను పరిష్కరించ వలసి ఉందని తెలిపారు. జిల్లా పరిధిలో తిరస్కరించిన మ్యుటేషన్ దరఖాస్తులు గత మూడు నెలల్లో 1458, గత నెల రోజులు గా 442 ఉన్నాయని కలెక్టర్ మాధవీలత వివరించారు. సివిల్/కుటుంబ తగాదాలకు చెందినవి 104, ప్రోహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కి చెందినవి 11, ప్రభుత్వ భూమిగా పేర్కొంటున్నవి ,- 9, అదనపు పరిధి సర్వే అవసరం అని క్లెయిమ్ చేసినవి 91, భూమి మర్పిడుకోసం రెండు కేటగిరీ లలోనివి తిరస్కరించిన వాటిలో ఉన్నట్లు వివరించారు. ఫారం-8 జారీ కి ముందు తిరస్కరణకు గురైనవి జిల్లాలో 890 ఉన్నాయన్నారు. సరైన లింక్ రికార్డులు (డాక్యుమెంట్లు ) లేని కేటగిరీలో 790 ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *