-దినేష్ కుమార్ పిలుపునకు అపూర్వ స్పందన!
-క్లీన్ రాజమహంద్రవరం కోసం పౌరులంతా సహకరించాలి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
క్లీన్ – గ్రీన్ రాజమహేంద్రవరం లో భాగం గా నగరపాలక సంస్థ కమీషనర్ కె.దినేష్ కుమార్ చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. శుక్రవారం రోజు గోదావరి ఘాట్ లలో ఉద్యోగులలో కలిసి మరో ప్రత్యేక కార్యక్రమానికి కమీషనర్ శ్రీకారం చుట్టారు. నగరపాలక సంస్థ లో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ నేడు గోదావరి రేవులో శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. వెంటనే స్పందించిన అన్ని విభాగాల అధిపతుల తో సహా..బయట పనిచేసే కార్మికుల వరకూ అందరూ పాల్గొని రేవుల్లో పేరుకుపోయిన చెత్తను స్వచ్చద్దంగా శుభ్రం చేసే కార్యక్రమం లో పాల్గొన్నారు.
గోదావరీ ప్రక్షాళన లో పలు పంచుకున్న ప్రతి ఒక్కరూ ఎంతో పవిత్రంగా భావించే గోదావరి నది లోనూ, తీరం వెంబడి ఉన్న ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ చూసి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర గోదారి లో ఇలాంటి చెత్త పేరుకుపోవడం మన ఆరోగ్యానికి అత్యంత ప్రమాదం అని, మనం వేసే చెత్త ఇలా సముద్రంలో కి కొట్టుకు పోతుంది అనుకోవడం మరింత ప్రమాదం అని కమిషనర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. మనం ఒక్కరూ అనే భావన ఉండరాదని, పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్నా యన్నారు. నదీ స్నానానికి వచ్చే వారికి ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఉదాసీన వైఖరి అవలంబించడం బాధాకరం అన్నారు. ఇకపై నదీ కాలుష్యానికి కారకులైన వారి పై చర్యలు తీసుకుంటాం అన్నారు. మార్కండేయ ఘాట్, లాంచీ ల రేవు,పద్మావతి ఘాట్ లలో శ్రమదానం చేసి శుభ్రం చేశారు. నగరపాలక సంస్థ ఉద్యోగుల్లో వచ్చిన ఈ మార్పు రాజమహేంద్రవరం కు వరంగా మారే రోజు కొద్ది రోజుల్లోనే ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News