Breaking News

నగరంలో పూర్తి శాఖాహార “బెంగళూరు భవన్” ప్రారంభం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాఖాహార భోజనప్రియులకు అందరికి అందుబాటులో ఉండే విధముగా “బెంగళూరు భవన్” ను ప్రారంభించామని నిర్వాహకులు కే.లీలా రామ్ ప్రసాద్, ఎస్ శ్రీకాంత్, కె రవి కుమార్ లు తెలిపారు. శుక్రవారం పిన్నమనేని పాలిటెక్నిక్ రోడ్ లో బెంగళూరు భవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అన్ని రకాల రుచులతో పూర్తి శాకాహార ఆహారం ఉండేటట్లు బెంగళూరు భవన్ ను అందుబాటులో ఉంచామన్నారు.
ఇడ్లీ, వడ, దోశ, టీ, కాఫీలతో పాటు లతో బెంగళూరు వారి ప్రత్యేక వంటకాలు నార్త్ ఇండియన్ ఫుడ్ ఐటమ్స్, చైనీస్ ఫుడ్ ఐటమ్స్, తందూరి, బిర్యానీలు అన్ని రకాల చాట్ తిను బండారాలు, ఇంకా అనేక రకాల శీతలపానీయాలు, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ ఉన్నాయని తెలిపారు. శాకాహారుల కోసం ఈ బెంగళూరు భవన్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో విజయవాడ తో పాటు హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో మరిన్ని బ్రాంచీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. నగర ప్రజలకు అతి తక్కువ రేట్ లో క్వాలిటీ ఫుడ్డు ని  అందించాలనే మా ఉద్దేశమన్నారు. శాఖాహార భోజన ప్రియులు బెంగళూరు భవన్ నీ దినదినాభివృద్ధి చెందుతూ నగరంలో మరిన్ని సెంటర్ లు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కస్టమర్లు, హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *