అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన తొలితరం వీరుడు….

-కలెక్టర్ డా.కె.మాధవిలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత స్వతంత్ర సంగ్రామంలో మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన తొలితరం వీరుడని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అన్నారు. సోమవారం స్థానిక పివి నరసింహారావు గోదావరి బండ్ వద్ద అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రం ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు 27 సంవత్సరాలు మాత్రమే జీవించినప్పటికీ , దేశ స్వాతంత్ర సముపార్జన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అన్నారు. ఆంగ్లేయులపై దేశ స్వాతంత్య్ర స్ఫూర్తి కోసం ఎదురొడ్డి పోరాడిన మహోన్నతమైన వ్యక్తి అన్నారు. స్వతంత్ర పోరాటంలో ఆయన చూపిన చొరవ, ఆత్మ విశ్వాసం, దైర్యసాహాసాలు ఎనలేనివన్నారు. ఆయన జీవితం భావితరాలకు తెలియచెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జయంతిని అధికారికంగా జరుపుకోవాలని ఆదేశాలు నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆయన భావజాలాన్ని భవిష్యత్తు తరాల కు అందించేందుకు చేస్తున్న కృషి కి అనుగుణంగా అడుగులు వేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు ఒక జిల్లా పెట్టడం జరిగిందన్నారు. ఆయన జయంతి జరుపుకోవడంతోపాటు భావితరాలకు స్వతంత్ర పోరాటంలో ఆయన చూపిన చొరవ ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలకు భావితరాలకు నీ చెప్పే విధంగా ఫోటోల రూపంలో ప్రదర్శన ఏర్పాటు కు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ కే దినేష్ కుమార్, రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు, జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు, యువజన సంఘం కార్యదర్శి చీకట్ల శివన్నారాయణ, కార్యవర్గ సభ్యులు, ఎర్ర ఉమామహేశ్వరరావు, ఎస్ఎస్ రాఘవేంద్ర, శ్యామల, పార్వతి, ఎర్ర కృష్ణ కుమార్, ఇఎన్ఎస్ బాలు, తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *