-హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు షేక్. ఖలీఫాతుల్లాబాషా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు నిగా షేక్. ఖలీఫాతుల్లాబాషా నియమితులైన సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉమెన్స్ ప్రోటాక్షన్ ఛైర్మన్ జ్ఞాన సుందరి అధ్యర్యంలో జరిగిన అభినందన సభ కు ముఖ్యఅతిథిగా వచ్చిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు షేక్. ఖలీఫాతుల్లాబాషా విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన వివిధ రాష్ట్ర, జిల్లా నుంచి వచ్చిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యంగా నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యంగా ఫలాలు ప్రతి ప్రతిఒక్కరికీ అందలసిందేనని అపుడే నిజమైన స్వతంత్రo వచ్చినట్లు అన్నారు. రాజ్యంగా ఆర్టికల్ ఒకటి నుంచి ముఫై దాకా భారత భారత ప్రతి పౌరుడు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హ్యూమన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరుపున ఆపదలో ఉన్న అభాగ్యులుకు నిత్యం అండగా నిలిచి వారిని అదుకున్నామని కరోన కష్టా కాలములో కరోన వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తలుతో వారికి కావలసిన మందులు,ఆహార సదుపాయాలు కల్పించమన్నారు. ఆంధ్రనుంచి సౌదీఅరేబియా తో పాటు పలు విదేశాలకు వెళ్లి అరబ్ షేక్ కుల బారిన పడి చిత్రవధతో బాధ పడుతున్న అనేకమంది మహిళలలను షేక్ కుల చారనుంచి రక్షించి సొంత ఖర్చులతో వారివారి స్వగ్రామం లకు తీసుకొని వెళ్లి వారి కుటుంబాలకు అప్పగించి వారికి కావలసిన ఆర్ధిక సహాయం చేయడం జరిగిందన్నారు. మహిళ కౌన్సిల్ తరుపున చట్ట పరిధిలో మనస్పర్థలు తో నలిగిపోతున్న అనేక మంది భార్య భర్తల ను కలిపి వారి కుటుంబాలను నిల్పమన్నారు.పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయం,పేద మహిళ లకు జీవన ఉపాధి కోసం కుట్టు మిషెన్లు ఇచ్చి ఆదుకోవడం జరిగిందన్నారు.తను తన టీం చేస్తున్న సమాజ సేవ ను దృష్టిలో పెట్టుకొని తనకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడుగా నియమిచ్చారన్నారు.
ఏపి లోని ఒంగోలు సిటీ కి చెందిన షేక్. ఖలీఫాతుల్లాబాషా 2017 నుంచి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో ఏపి అధ్యక్షుడు గా, సౌత్ ఇండియా రీజియన్ ఛైర్మన్ అంచెలంచెలుగా ఎదుగుతూ సమాజ సేవతో పాటు మానసిక రుగ్మతలకు లోనై హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ను ఆశ్రయించినవరికి అండగా నిలిచి ఆపద్బాంధవుడిగా మంచి పేరు తెచ్చుకుని జాతీయస్థాయిలో ఎదిగినా షేక్. ఖలీఫాతుల్లాబాషా ను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీమ్ సభ్యులు తదితర మిత్రులు అభినందనoలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపి జనరల్ ఛైర్మన్ మన్నెం ఉషా, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపి రాష్ట్ర వైస్ ఛైర్మన్ ఆర్.జ్యోతి, కృష్ణా జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒర్కిగ్ ప్రెసిడెంట్ శిరీష్ రాణి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News