ఆగస్టు మాసం పిడిఎస్‌ పియంజికెఏవై ఉచిత బియ్యం పంపిణీకి సిద్దం

-జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఆగస్టు నెల 1 నుండి ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌అన్నయోజన (పియంజికెఏవై) ఉచిత బియ్యంతో పాటు ప్రతి మాసం పంపిణీ చేసే పిడిఎస్‌ ( పబ్లిక్‌ డిస్ట్రిబ్యుషన్‌ సిస్ట) బియ్యం పంపిణీ చేయనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఆహర భద్రత చట్టం ద్వారా జిల్లాలో గుర్తించిన 1,62,384 బియ్యం కార్డు దారులకు ఆగస్టు 1వ తేదీనుండి ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నయోజన (పియంజికెఏవై) పథకం ద్వారా ప్రతి వ్యక్తికి 5 కేజిల నాన్‌ సార్టేక్స్‌ బియ్యాన్ని రేషన్‌ షాపుల వద్ద డీలరు ద్వారా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన లబ్దిదారులకు వాలంటీర్ల ద్వారా రెండు రోజుల ముందుగా కూపన్‌లను వారి ఇంటి వద్ద అందించడం జరుగుతుందన్నారు. లబ్దిదారులు వారి కూపన్‌లలో నమోదు చేసిన రేషన్‌ దుకాణాలద్వారా పియంజికెఏవై బియ్యాన్ని ఉచితంగా పొందలన్నారు. ఆగస్టు 1వ తేదీనుండి ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సార్టేక్స్‌ బియ్యాన్ని యధావిధిగా జిల్లాలోని 5,86,420 కార్డు దారులకు 374 సంచార పంపిణీ వాహనాల ద్వారా ఆగస్టు 1వ తేదీ నుండి ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్డు దారుల ఇంటి వద్దే పంపిణీ చేయడం జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *