-జిల్లాలో 7 లక్షల జెండాల పంపిణీ .. ఆగస్టు 1 నుంచి 15 వరకూ స్పూర్తి వంతమైన కార్యక్రమాలు..
-నమూనా సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగిన కలెక్టరు, జేసీ, మున్సిపల్ కమీషనర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత దేశ స్వాతంత్ర సంగ్రామం యొక్క విశేషాలు, ఆనాటి స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలు , వారి జీవిత విశేషాలను భవిష్యత్ తరాలకు అందించే దిశలో 75 వ అజాది కా అమృత్ మహోత్సవ కార్యక్రమాలను జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, డి ఆర్ వో బి. సుబ్బారావు లతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఆజాదీ కా అమృ త్ మహోత్సవ్లో భాగంగా ఈ నెల 1 నుంచి 15 వ తేదీ వరకు ‘ హర్ ఘర్ తిరంగా ‘ పేరుతో ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగుర వేయాలని ప్రధాని మంత్రి మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయం గా అధికారులను ఆదేశాలు చేశారన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఏడు లక్షల జాతీయ జెండాలను ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా, రాష్ట్రాలలో, నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో అజాది కా అమృత కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఘనంగా ” హర్ ఘర్ తిరంగా ” కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు మాధవీలత తెలిపారు. ఆగస్ట్ 1 నుంచి 15 వరకు వివిధ అంశాలపై కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగం గా జిల్లాలోని ప్రతి ఇల్లు, షాపింగ్ కాప్లెంక్స్, వివిధ సంస్థ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్య కూడలిలో నుంచి జాతీయ జెండాను ఎగుర వేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసామని కలెక్టర్ కె.మాధవీలత తెలిపారు. నగరంలో, మండల కేంద్రాల్లో ప్రముఖ ప్రదేశాల్లో సెల్ఫ పాయింట్లు ఏర్పాటు చేసిన చోట ఫోటోలు దిగి ఆఫోటోలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా నమూనా సెల్ఫీ పాయింట్ వద్ద కలెక్టరు, జేసీ, మున్సిపల్ కమీషన ఫోటోలు దిగారు.
ఆగస్ట్ 2 న జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద మంగళ వారం ఉదయం 9.00 గంటలకు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని స్వాతంత్ర్య సమర యోధుల వివరాలు సేకరించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. వారిని లేదా వారి కుటుంబ సభ్యులను అజాదికా అమృత్ మహోత్సవ పేరున ఘనంగా సన్మానించు కోవడం జరుగుతుందన్నారు. వయస్సు రీత్యా రాలేని వారి ఇంటి వద్దకే ఆర్డీవో, తహశీల్దార్ లు వెళ్లి ప్రభుత్వం తరపున సన్మానం చేస్తామని తెలిపారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో అజాదికా అమృత్ మహోత్సవ సందర్భంగా పలు సాంస్కృతిక , కళా రూపాలతో ప్రదర్శన కార్యక్రమాలు చెప్పడుతున్నట్లు కలెక్టరు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు నేరుగా కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావచ్చునని తెలిపారు. 15 రోజులు పాటు నిర్వహించి వేడుగలకు సంబందించి పోస్టర్లును, కరపత్రాలను కలెక్టరు ఆవిష్కరించారు.
Prajavartha Online Telugu News