యువతకు ఉద్యోగ కల్పనకు సీ.ఎం జగన్ కృషి

-రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి భరోసా కల్పించడమే ధ్యేయంగా చర్యలు…
-నిరుద్యోగులకు అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ తరగతులు…
-ప్రతి నియోజకవర్గంలోనూ జాబ్ మేళాల నిర్వహణ..
-జిల్లాలో వికాస్, నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా ఉపాధి అవకాశాలు
-డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మెగా జాబ్ మేళా
-వై.యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా జాబ్ మేళాను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె.మాధవి లత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అందుకు అనుగుణం గానే స్థానికంగా ఏర్పడిన ఇండస్ట్రీలలో 75% ఉద్యోగాలు స్థానికులకే కేటాయించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవిలత, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా లు పేర్కొన్నారు. శుక్రవారం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి “బెన్నయ్య క్రిస్టియన్ కాలేజెస్” నందు దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, వికాస ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కె మాధవి లత హాజరై జ్యోతి ప్రజ్వాలను చేశారు. ముందుగా సభా ప్రాంగణం నందు దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం ఉద్యోగ మేళా నందు వివిధ కంపెనీల్లో ఉద్యోగాకు సాధించిన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ కె.మాధవి లత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డా. కె మాధవి లత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధానిస్తూ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా అనేక కార్యక్రమాల రూపొందించడం జరిగిందన్నారు. అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, విద్యా కానుక వంటి పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మన బడి నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల రూపు రూపు రేఖలు మార్చి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూలుకు దీటుగా రూపుదిద్దారని అన్నారు. చదువుకున్న విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు కల్పించాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వినూత్న ఆలోచన విధానంతో, మెరుగైన ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా డిగ్రీ చదువుకునే విద్యార్థులకు రెండు నెలల ఇంటర్ షిప్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు నైపుణ్యం కు ఈ ప్రోగ్రాములు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతోనే జాబ్ మేళాలను నిర్వహిస్తున్నామన్నారు.

నేడు రాజానగరం నియోజకవర్గంలో జరుగుతున్న ఉద్యోగమేళాలలో పలు కంపెనీల్లో సుమారు 2 వేలకు పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ రోజు ఉద్యోగ మేళాలో 26 కంపెనీలు ఇక్కడకు రావడం జరిగిందని సుమారు 3500 మంది వివిధ ఉద్యోగాలు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని కలెక్టర్ మాధవీలత అన్నారు.
స్థానికంగా కొత్త ఇండస్ట్రీ ఏర్పడితే 75% ఉద్యోగులకు స్థానికులకే కేటాయించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఉద్యోగులు సాధించిన యువత మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని,ఉద్యోగం రాని వారు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా తగిన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. యువత తమకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు బంగారు బాటకు పునాదులు వేసుకోవాలన్నారు

ఈ సందర్భంగా శాసన సభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రతి ఏడాది దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి , వర్ధంతి రోజున పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నేడు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగులు లభించక అనేక మంది ఇబ్బంది పడుతున్న తరుణంలో వినూత్నమైన ఆలోచనతో మెగా జాబ్ మేళాకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన ముఖ్యమంత్రి గా ఉన్న హాయంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదవారి అభ్యున్నతికి కృషి చేయడం జరిగిందన్నారు. ఆ సమయంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు దేశంలో ఉన్న అనేక రాష్ట్రంలో కూడా నేడు అమలు చేస్తుండడం గమనార్హం అన్నారు.

ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు,108 సేవలు వంటి పథకాలు అమలు చేసి పేదవారి హృదయంలో దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి సుస్థిర స్థానం సంపాదించడం జరిగిందన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా నేడు జగన్ మోహన్ రెడ్డి అంతకు రెండింతలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు .
పేదవారి పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టి పేదవారి పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకునే విధంగా చర్యలు తీసుకుని పేదవారి బతుకులో వెలుగులు నింపిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి అని జక్కంపూడి రాజా అన్నారు. డా రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిందన్నారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తండ్రికి తగ్గ తనయుడిగా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నారన్నారు.

దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఆశయాల మేరకు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ తీసుకువచ్చి లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు.

నేడు రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా చేపడుతున్న ఈ ఉద్యోగ మేళా కార్యక్రమంలో వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తు ఉన్నతికి అడుగులు వేయడం జరుగుతుందన్నారు. ఉద్యోగం మేళాను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. మాధవి లత దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆమె అందించిన సహాయ సహకారాలు మరువలేని ఇంత తక్కువ కాలంలోనే ఇంత చక్కటి మెగా ఉద్యోగం మేళా నిర్వహిస్తున్నా మంటే అందుకు కారణం జిల్లా కలెక్టర్ కె మాధవి లత వారి చోరవ అని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వికాస పీడీ లచ్చారావు, జడ్పిటిసిలు కర్రి నాగేశ్వరరావు,వాసంశెట్టి పెద్ద వెంకన్న,క్రొవ్విడి సర్రాజు, కంటే వినయ తేజ, రమాదేవి, బొరుసు బద్రి,గండి నానిబాబు, కొండపల్లి దుర్గారావు,తోరాటి సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *