రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవం యొక్క ప్రగతిని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి మంగళవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశములో మెంబర్ టి.రామసింగ్ (టెక్నికల్), మెంబర్ శ్రీ పి.రాజగోపాల రెడ్డి (ఫైనాన్స్), ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అఫ్ ఏ.పి లిమిటెడ్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోసరావు ఏ.పి. ట్రాన్స్ కో డైరెక్టర్, గ్రిడ్ ఆపరేషన్ ఏ.కె.వి.భాస్కర్, చీఫ్ జనరల్ మేనేజర్, ఆపరేషన్ & మైంటెనెన్స్ వి .విజయలలిత తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశములో పర్యవేక్షక ఇంజనీర్, ఆపరేషన్ సర్కిల్, ఎ.పి.ఇ.పి.డి.సి.యల్ రాజమహేంద్రవరం టి.వి.ఎస్.ఎన్.మూర్తి, జనరల్ మేనేజర్, కస్టమర్ సర్వీస్ సెంటర్ విశాఖపట్నం ఎస్.రాజబాబు, ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం పరిధిలో గల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ట్రాన్స్ కో అధికారులు మరియు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పాల్గొన్నారు. ఈ సమావేశములో నూతన E.H.T విద్యుత్ ఉపకేంద్రములు స్థల సమీకరణ, నిర్మాణ ప్రగతి, విద్యుత్ అంతరాయాలు, 33 కేవి, 11 కెవి ఓవర్ లోడెడ్ ఫీడర్లు, విద్యుత్ బకాయిలు, విద్యుత్ ప్రమాదాలు మొదలగు సాంకేతిక అంశాలపై సమీక్షించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయములు తగ్గించి, విద్యుత్ వినియోగదారులకు 24×7 నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని సూచించారు. రైతులకు 9 గంటలు విద్యుత్ సరఫరా నిరంతరంగా జరిగే విధముగా చూడాలని, కొత్త విద్యుత్ కనెక్షన్లు ఏ విధమైన జాప్యం చేయకుండా వెంటనే రిలీజ్ చేయాలని మరియు విద్యుత్ వినియోగదారులకు పారదర్శకంగా అన్ని రకాల సేవలు సత్వరమే అందించాలని సూచించారు. విద్యుత్ ప్రమాదములు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత ప్రమాదాల పరిహారములను త్వరితముగా అందే విధముగా చూడాలని ఆదేశించారు. పెండింగ్ లో వున్న విద్యుత్ బకాయిలను వసూలు చేయాలని, మీటర్డ్ సీల్స్ పెంచాలని, సరఫరా మరియు పంపిణీ నష్టాలను తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డి సూచించారు.
Prajavartha Online Telugu News